తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 14, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఆదివారంతో(429) పోలిస్తే సోమవారం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 614 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఒక్కరోజులో ఒక్క కరోనా మరణం కూడా లేకపోవడం ఊరటనిచ్చే అంశం.
అదే సమయంలో గత 24గంటల వ్యవధిలో 2వేల 387మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9వేల 908 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50వేల 520 మందికి కరోనా పరీక్షలు చేశారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 131 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







