భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- February 15, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంటల్లో 12,29,536 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 27,409 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,26,92,943కి చేరింది. నిన్న347 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,09,358కి చేరింది.

ఒక్క రోజులో 82,817 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,17,60,458కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,09,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 97.82 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.23 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 44,68,365 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 173.42 కోట్ల‌ డోసుల‌ను పంపిణీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com