ఏపీ కరోనా అప్డేట్

- February 15, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి.క్రితం రోజుతో(434) పోలిస్తే మంగళవారం కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 22వేల 267మందికి కరోనా పరీక్షలు చేయగా 615మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.కోవిడ్ తో మరో నలుగురు చనిపోయారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కరోనాతో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.అదే సమయంలో ఒక్కరోజే 2వేల 787 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 23,13,827.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,86,575. రాష్ట్రంలో 12వేల 550 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 14వేల 702కి పెరిగింది. నేటి వరకు రాష్ట్రంలో 3,28,69,245 కరోనా టెస్టులు చేశారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com