COVID ఆంక్షలను ఎత్తివేసిన కువైట్
- February 16, 2022
కువైట్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తోంది. ఈ క్రమంలో పలు దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నదేశాల జాబితాలో తాజాగా కువైట్ చేరింది. కొవిడ్ 19 అదుపులోకి రావడంతో కువైట్‌లో పలు కొవిడ్ పరిమితులను ఎత్తివేశారు. కోవిడ్-19 పూర్తి వ్యాక్సిన్ డోసులను వేసుకున్న వారికి కువైట్ కు వచ్చే ప్రయాణీకులు డిపార్చర్/ఆన్-రైవల్ PCR పరీక్షలు, అలాగే క్వారంటైన్‌ను నిబంభనను ఎత్తివేసింది. అలాగే వ్యాక్సిన్ వేయని వ్యక్తులను కువైట్‌కి రావడానికి, మాల్స్, సినిమా థియేటర్లలోకి ప్రవేశించడానికి అనుమతించింది. కాకపోతే వారు72 గంటలముందు PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. పాక్షికంగా టీకాలు(సింగిల్ డోస్) వేసిన వ్యక్తులు కువైట్ వచ్చేముందు PCR సర్టిఫికేట్ తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ తప్పనిసరిగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఎనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోని వారు కువైట్ వచ్చే 72 గంటల ముందు చేయించుకున్న PCR పరీక్ష సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. అలాగే వచ్చిన తర్వాత ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగుల సామర్థ్యం మార్చి 13 నుండి 100 శాతానికి పునరుద్ధరించబడుతుంది. పూర్తి సామర్థ్యంతో ప్రజా రవాణా పనిచేయనుంది. మస్జీదుల్లోనూ భౌతిక దూరం నిబంధనను తొలగించారు. సమావేశాలకు అనుమతిచ్చారు. హెల్త్ ప్రోటోకాల్‌లను అనుసరించి వివాహాలతో సహా సామాజిక సమావేశాలు ఇంటి లోపల లేదా ఓపెన్ గా నిర్వహించుకోవచ్చు. టీకాలు వేయని 16 ఏళ్లలోపు స్కూల్ పిల్లలు ప్రతి వారం PCR పరీక్ష చేయించుకోవాలన్న నిబంధనను రద్దు చేశారు. అయితే లక్షణాలున్న స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరిగా ఐసోలేట్ కావాలి. కొత్త కొవిడ్ నిబంధనలు ఫిబ్రవరి 20 నుండి అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







