జెడ్డాలో కూల్చివేసిన ఆస్తులకు పరిహారం
- February 16, 2022
సౌదీ: జెడ్డాలో పునర్నిర్మాణం కోసం కూల్చివేసిన ఆస్తులకు సంబంధించి పరిహారం చెల్లింపు 60 రోజుల తర్వాత ప్రారంభమవుతుందని స్టేట్ ప్రాపర్టీస్ జనరల్ అథారిటీ (SPGA) గవర్నర్ ఇహ్సాన్ బఫకిహ్ తెలిపారు. కూల్చివేసిన వాటిల్లో 10-15 శాతం మాత్రమే చట్టపరమైన యాజమాన్య పత్రాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. కూల్చివేసిన ఆస్తుల విలువను అంచనా వేయడానికి కమిటీలను ఏర్పాటు చేశామని, ఆరు నెలల్లో పరిహారం చెల్లించబడుతుందని చెప్పారు. ఇప్పటివరకు కూల్చివేసిన వాటిల్లో సరైన టైటిల్ డీడ్ లు ఉన్నవి 10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉంటాయని, మిగిలినవి అత్యధికంగా అక్రమంగా నిర్మాణించినవని చెప్పారు. మురికివాడలు, నిర్దేశిత ఏరియాల్లో నివసించే వారి కోసం SPGA జారీ చేసిన ప్రమాణాలు సౌదీ అంతటా వర్తిస్తాయని బఫాకిహ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!







