భారీ స్థాయిలో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు
- February 16, 2022
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు (కెసిఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలు జరపాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈమేరకు కార్యాచరణను సిద్దం చేశారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తున్న దశలో సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని పిలుపు నిచ్చారు. ఆయా కార్యక్రమాల వివరాలను పార్టీ శ్రేణులకు విడుదల చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో పండ్లు పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ చేపట్టారు. బుధవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు కేటీఆర్ వెల్లడించారు. ఇందులో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని రక్తదానంలో పాల్గొనాలని కోరారు. 17న కెసిఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం నిర్వహిస్తామని చెప్పారు. ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని పార్టీ కార్యకర్తలకు మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- పిల్లలు, తల్లిదండ్రుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ డెమో సెషన్
- సౌదీ అరామ్కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!
- ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!
- COP31 సదస్సులో ఒమన్..2050 నాటికి నెట్‌జీరోకు కృషి..!!
- కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!
- బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!







