30 మహిళా ట్రైన్ డ్రైవర్ పోస్టుల కోసం 28,000 దరఖాస్తులు

- February 17, 2022 , by Maagulf
30 మహిళా ట్రైన్ డ్రైవర్ పోస్టుల కోసం 28,000 దరఖాస్తులు

సౌదీ అరేబియా: 30 మంది మహిళా ట్రైన్ డ్రైవర్ల నియామకానికి సంబంధించి పోస్ట్ చేసిన ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. 28,000 దరఖాస్తులు అందాయి ఈ ప్రకటన నిమిత్తం. మహిళలకు సౌదీ అరేబియాలో లభిస్తున్న అవకాశాలకు ఇది ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. స్పానిష్ రైల్వే ఆపరేటర్ రెన్ఫె మాట్లాడుతూ,ఆన్‌లైన్ విధానంలో అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ మరియు ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం వంటి విభాగాల్లో ఫిల్టర్ చేయడం ద్వారా సగం అప్లికేషన్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. మార్చిలో మిగతా స్క్రూటినీ పూర్తవుతుంది. ఎంపికయ్యే 30 మంది మహిళా డ్రైవర్లు బుల్లెట్ రైళ్ళను మక్కా మరియు మదీనా మధ్య నడుపుతారు. వీరికి ఏడాదిపాటు పెయిడ్ ట్రైనింగ్ లభిస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com