షార్జా సఫారీ పార్క్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

- February 18, 2022 , by Maagulf
షార్జా సఫారీ పార్క్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

యూఏఈ: ప్రపంచంలోనే ఆఫ్రికా తర్వాత అతిపెద్ద సఫారీ అయిన షార్జా సఫారీ పార్క్ ను సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షేక్ సుల్తాన్‌తో పాటు షార్జా డిప్యూటీ రూలర్లు షేక్ అబ్దుల్లా బిన్ సలేం బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి, షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి లతోపాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. షేక్ సుల్తాన్, షేక్‌లు షార్జా సఫారీ పార్క్ లో పర్యటించారు. మొత్తం 12 ప్రధాన థీమ్ పార్కులను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి థీమ్ పార్క్ ఆఫ్రికాలోని ఒక ప్రాంతానికి సూచికగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా ప్రాంతాల్లో నివసించే జంతువులు, పక్షులను ఏర్పాటు చేశారు. అల్ దైద్ నగరంలోని అల్ బ్రిడి నేచర్ రిజర్వ్ 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. షార్జా సఫారి ఆఫ్రికాలో పర్యటించిన అనుభూతిని అందిస్తోంది. ఆఫ్రికాలో నివసించే 120 కంటే ఎక్కువ జాతుల చెందిన దాదాపు 50,000 కంటే ఎక్కువ జంతువులు, 100,000 ఆఫ్రికన్ చెట్లను సఫారీలో ఏర్పాటు చేశారు. టిక్కెట్లను మూడు వేర్వేరు కేటగిరీలు(గోల్డ్, సిల్వర్, బ్రాంజ్)గా విభజించారు. ఎంట్రీ ధరలు కూడా 15 Dhs (సాధరణ)- 3,500 Dhs(లగ్జరీ) వరకు అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com