నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జా
- February 18, 2022
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయనకు చెందిన భూమి కబ్జా గురైంది. చంద్రబాబు స్థలంలో రాజేంద్రనాయుడు అనే వ్యక్తి ఫెన్సింగ్ వేశారు. దీంతో చంద్రబాబు బంధువులు రాజేంద్రనాయుడుని అడ్డుకున్నారు. 38సెంట్ల స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో చంద్రగిరి తహశీల్దార్ కి ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1989లో సర్వే నంబర్ 222/5లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని నారా చంద్రబాబు నాయుడు తండ్రి నారా ఖర్జూర నాయుడు కొనుగోలు చేశారు. ఆయన తదనంతరం ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. మిగిలిన 38 సెంట్ల భూమి వారి పేరు మీద ఆన్లైన్లో నమోదు చేసుకోకపోవడంతో.. అదే అదనుగా భావించిన రాజేంద్ర నాయుడు.. భూమిని కబ్జా చేసేందుకు రాతి కుసాలు నాటుతున్నారు.ఈ భూమికి సంబంధించిన పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉండడంతో నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో ప్రతి సంవత్సరం నారా భువనేశ్వరి సంక్రాంతి పర్వదినాన రంగవల్లులు, క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







