ఉక్రెయిన్‌ విషయంలో ఇజ్రాయిల్‌ సంచలన నిర్ణయం

- February 18, 2022 , by Maagulf
ఉక్రెయిన్‌ విషయంలో ఇజ్రాయిల్‌ సంచలన నిర్ణయం


అమెరికాను పొమ్మంది ఇజ్రాయిల్‌. అమెరికా చెప్పినా… ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. ఐరన్‌ డోమ్ డిఫెన్స్ సిస్టమ్‌కి సంబంధించిన బ్యాటరీలను ఇవ్వడానికి ఉక్రెయిన్ నిరాకరించింది.

అంటే.. రష్యా కూటమికి మద్దతివ్వడానికి ఇజ్రాయిల్ రెడీ అయిపోయిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ కథనం ప్రకారం.. తాము ఉక్రెయిన్‌కు ఐరన్ డ్రోమ్ బ్యాటరీలను పంపలేమని అమెరికాకు ఇజ్రాయిల్ తెగేసి చెప్పేసింది. అంటే… ఉక్రెయిన్ ఈ బ్యాటరీల విషయంలో నేరుగా ఇజ్రాయిల్‌నే సంప్రదించాల్సి వుంటుంది. అయితే.. తమకు ఈ బ్యాటరీలు కావాలంటూ కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్ అమెరికాను ఆశ్రయించింది. దీనికి డెమోక్రెట్స్‌, రిపబ్లికన్లు మద్దతిచ్చారు.

ఆ తర్వాత అమెరికా ఈ విషయంపై ఇజ్రాయిల్‌తో చర్చించింది. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ ఎదురు తిరగడంతో అమెరికా ఇరుక్కున్నట్లైంది. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయిల్ కలిసే ఈ ఐరన్ డ్రోమ్ బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. అందుకే వీటి సాంకేతికత కావాలంటే ఇరు దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఉక్రెయిన్ మాత్రం ఇజ్రాయిల్ సహాయాన్ని కోరుతోంది. ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో తమకు ఇజ్రాయిల్ సహాయం కావాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వారం రోజుల కిందటే అభ్యర్థించింది. అయినా… ఇజ్రాయిల్ ఈ సాంకేతికతను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com