'భారత వ్యతిరేక' కామెంట్స్ సమర్థించిన ఎంపీ శశి థరూర్ పై విమర్శలు

- February 19, 2022 , by Maagulf
\'భారత వ్యతిరేక\' కామెంట్స్ సమర్థించిన ఎంపీ శశి థరూర్ పై విమర్శలు

కువైట్: ట్విటర్‌లో భారత వ్యతిరేక పోస్ట్‌ను సమర్థించిన ఎంపీ శశి థరూర్‌ను కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం విమర్శించింది. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పాకిస్థానీ ప్రభుత్వం నుండి 'పీస్ అంబాసిడర్' అనే అవార్డు పొందిన పాకిస్థానీ ఏజెంట్ చేసిన భారత వ్యతిరేక ట్వీట్‌ను భారత పార్లమెంటు సభ్యుడు రీట్వీట్ చేయడం బాధాకరం.. ఇలాంటి భారత వ్యతిరేక అంశాలను ప్రోత్సహించకూడదు అంటూ భారత రాయబార కార్యాలయం తన ట్వీట్లో పేర్కొంది. ఆ తర్వాత శశి థరూర్ స్పందించారు. భారత రాయబార కార్యాలయం అభిప్రాయాన్ని అంగీకరిస్తూ.. తన ట్వీట్‌తో వ్యక్తిని ఆమోదించనని చెప్పాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com