ఐఐటీ హైదరాబాద్‌తో చేతులు కలిపిన బసవ తారకం ఆస్పత్రి
- February 19, 2022
హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రి, ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాచరణ కోసం రెండు సంస్థలు ఓ అవగాహనకు వచ్చాయని తెలిపారు. కొత్త కోర్సు ప్రవేశపెట్టేందుకు జరిగిన ఒప్పందంపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి, బసవతారకం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.సుబ్రమణేశ్వర్ సంతకాలు చేశారని బాలకృష్ణ వివరించారు. కాగా ఇటీవల బసవ తారకం ఆస్పత్రిలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..