మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్ ప్రారంభం
- February 20, 2022
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంస్థకు ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీని అప్పుల నుంచి గట్టెక్కించే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నారు. పండుగలు, వేడుకల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నిస్తూ సంస్థను లాభాల బాటల్లోకి తీసుకెళుతున్నారు. సంస్థను ప్రమోట్ చేయడానికి పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.సినిమా క్లిప్పింగ్ లను ప్రధానంగా పోస్టులు చేస్తున్నారు. తాజాగా మహిళా ప్రయాణికుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. మహిళలు సురక్షితంగా ఇంటికి చేరుకొనేందుకు ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చారు.
షీ టీమ్స్ విభాగం వెబ్ సైట్, యాప్ రూపకల్పన చేసినట్లు సమాచారం. బస్సులో ఎలాంటి అభద్రతా భావాలు కలిగినా.. వేధిస్తున్న ఘటనలు ఎదురైతే వెంటనే యాప్ కు సంబంధించిన స్కానర్ లో మొబైల్ తో స్కాన్ చేయాలని సూచిస్తున్నారు. బస్సు ప్రయాణిస్తున్న ఏరియా పోలీస్ స్టేషన్ కు వెళ్లేలా టెక్నాలజీ రూపొందించారని తెలుస్తోంది. ఈ మేరకు యాప్ కు సంబంధించిన స్కానర్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం లాంచ్ చేసింది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లో QR స్కానర్ లేకపోతే.. ప్లేస్టోర్ (ఆండ్రాయిడ్ ఫోన్లు) లేదా యాప్ స్టోర్ (I Phones) నుంచి ఏదైనా సురక్షితమైన QR స్కానర్ ను యాప్ ను డౌన్ లౌడ్ చేసుకోవాలని సూచించింది.
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. [email protected] మెయిల్ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల