గౌతంరెడ్డి పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
- February 21, 2022
హైదరాబాద్ : సీఎం జగన్ గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ మేకపాటి కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. జగన్‌ను చూడగానే గౌతమ్ రెడ్డి తల్లి బోరున విలపించారు. గౌతమ్ రెడ్డి సతీమణి, ఆయన తండ్రి రాజమోహన్ రెడ్డి కూడా జగన్‌ను చూడగానే.. బోరున విలపించారు. జగన్‌తో గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలగిన క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు జగన్ కనిపించగానే.. ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను చూసిన గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు బోరున విలపించడాన్ని చూసిన జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి పార్దివ దేహం పక్కనే కుర్చీలో కూర్చున్న జగన్ కన్నీరు పెట్టుకున్నారు. తన పక్కనే ఉన్న రాజమోహన్ రెడ్డిని జగన్ ఓదార్చగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి గౌతమ్ రెడ్డి తల్లి, సతీమణిని ఓదార్చారు.
రేపు ఉదయం 6 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం నెల్లూరు చేరుకోనుంది. రేపు సాయంత్రం వరకు నెల్లూరులోని ఆయన నివాసంలో సందర్శన కోసం ఏర్పాటు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుండి రేపు మధ్యాహ్నం నెల్లూరుకి రానున్నారు. బుధవారం ఉదయం స్వగ్రామమైన మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..







