దాణా కుంభకోణం కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష
- February 21, 2022
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీలోని సీబీఐ కోర్టు షాకిచ్చింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో ఆయనను దోషిగా తేల్చిన కోర్టు… ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈరోజు శిక్షను ఖరారు చేసింది.
1990లలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చూసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి ఇల్లీగల్ గా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదయింది.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..