'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రo రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో...

- March 30, 2016 , by Maagulf
'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రo రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో...

పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌మరార్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌, కాజల్‌పై ఈ పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంగ్‌ షూటింగ్‌లో దిగిన ఫొటోలను కథానాయిక కాజల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌ షూటింగ్‌లో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో రాజకుమారి ఆర్షి అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పవన్‌కళ్యాణ్‌ నటించిన ఈచిత్రంలో రాజకుమారి ఆర్షిగా కాజల్‌ నటించింది. 'స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో రెండు రోజుల్లో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఏప్రిల్‌ 8న ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీలోనూ విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని అందించే పవన్‌ మార్క్ చిత్రమిది' అని నిర్మాత శరత్‌మరార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com