సరికొత్త లుక్‌లో వాట్సాప్‌లో త్వరలోనే కొత్త ఫీచర్
- February 23, 2022
ఎప్పటికప్పుడు వినూత్నమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడంలో వాట్సాప్ముందుంటుంది. అందుకే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో రాణిస్తోంది. ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ తాజాగా మరో కొత్త ఫీచర్లపై పనిచేస్తుంది. సరికొత్త వాయిస్ కాల్ ఇంటర్ఫేజ్, ఎమోజీల కోసం షార్ట్‌కట్, అప్డేటెడ్ వాయిస్ నోట్ ఫార్వర్డ్ వంటి కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, ఇప్పటికే టెస్టింగ్ కోసం కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ కొత్త ఫీచర్లను అందుబాటులో తెచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా గ్రూప్ వాయిస్ కాల్స్ కోసం ఈ ఫీచర్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాయిస్ కాల్ సమయంలో గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికి రియల్ టైమ్ వేర్ఫారమ్ను చూపిస్తుంది. తద్వారా వాయిస్ కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు మ్యూట్‌లో ఉన్నారో సులభంగా తెలుసుకునే వీలుంటుంది. అలాగే, ఈ కొత్త ఇంటర్‌ఫేజ్‌లో వాల్పేపర్లను కూడా విడుదల చేయాలని వాట్సాప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త వాట్సాప్ వాయిస్ కాల్ ఇంటర్‌ఫేస్ ముందు, మధ్యలో రౌండ్ గ్రే స్క్వేర్‌తో రానుంది. దీనిలో కాంటాక్ట్ పేరు, నంబర్, ప్రొఫైల్ చిత్రం వంటివి కనిపిస్తాయి.
టెస్టింగ్ కోసం బీటా యూజర్లకు అందుబాటులోకి..
కాగా, ఫార్వర్డ్ నోట్స్, ఆడియో ఫైల్స్ మధ్య తేడాలను గుర్తించడానికి వాట్సాప్ త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫార్వర్డ్ చేసిన వాయిస్ నోట్స్ ఇకపై నారింజ రంగులో కనిపించనున్నాయి. అలాగే, ఇతరులతో చాటింగ్ చేస్తున్న సమయంలో ఎమోజీని త్వరగా ఎంచుకోవడానికి వాట్సాప్ షార్ట్‌కట్‌లను అందుబాటులోకి తేనుంది. దీనికి గాను యూజర్లు ఇష్టపడే ఎమోజీకి సంబంధించిన కీవర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్లు ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే పరిచయం చేసినప్పటికీ.. త్వరలోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, వాట్సాప్ ఇటీవల తమ నిబంధనలను ఉల్లంఘించిన వారి అకౌంట్స్‌ను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అకౌంట్ బ్లాకింగ్ గురించి యూజర్లు రియాక్ట్ అవ్వడానికి వాట్సాప్ కొత్త స్క్రీన్ తీసుకొచ్చే యోచనలో ఉంది. వాట్సాప్ అతి త్వరలోనే 'కమ్యూనిటీ' ఫీచర్‌ను విడుదల చేయడానికి కూడా కృషి చేస్తోంది. కమ్యూనిటీ అనేది వాట్సాప్‌లో గ్రూప్ అడ్మిన్లకు మరింత నియంత్రణ ఇచ్చే ఫీచర్. ఇది గ్రూప్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం