ఇ-సర్వీసుల వినియోగంలో అగ్రస్థానంలో సౌదీ

- February 25, 2022 , by Maagulf
ఇ-సర్వీసుల వినియోగంలో అగ్రస్థానంలో సౌదీ

సౌదీ: ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ సేవల మెచ్యూరిటీ ఇండెక్స్ (GEMS)లో సౌదీ అరేబియా మొదటి స్థానంలో ఉంది. ఈ ర్యాంకులను ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్ట్రన్ ఆసియా (ESCWA)  వెల్లడించింది. ఇ-పోర్టల్‌లు, స్మార్ట్ అప్లికేషన్‌ల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. వ్యక్తులు లేదా వ్యాపారాల కోసం వివిధ రంగాలలో ఇ-సర్వీసులను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్, లా, ఎకనామిక్, బిజినెస్, టూరిజం, హెల్త్, హౌజింగ్, మున్సిపల్ వ్యవహారాలు, లేబర్, సోషల్ జస్టిస్, ఎన్విరాన్ మెంట్, అంతర్గత రంగాలలో 84 ముఖ్యమైన ప్రభుత్వ సేవలను ESCWA పరిశీలించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com