బహ్రెయిన్ లో ఆన్లైన్/ఆఫ్లైన్ క్లాసులు
- February 25, 2022
బహ్రెయిన్: ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్.. స్టూడెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడి ఆఫ్లైన్/ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి సొంతంగా నిర్ణయించుకోవచ్చు. ఇదే సమయంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి లేదా ఆన్లైన్ విద్యను ఎంచుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ప్రైవేట్ స్కూల్స్ తమ విధానాలను సొంతంగా సెట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్, ఆన్లైన్ తరగతులను నిర్వహించేలా స్కూల్స్ తమ స్వంత అంతర్గత వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు భౌతికంగా హాజరు కావాల్సిన అంతర్గత పరీక్షలు మినహా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలోనూ పరీక్షలను నిర్వహించవచ్చు. ఏదైనా విద్యార్థిలో కొవిడ్ లక్షణాలు కన్పిస్తే రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయాలి. విద్యార్థిని/ఆమె ఇంటికి తీసుకెళ్లడానికి వారి పేరెంట్స్ వచ్చే వరకు సదరు స్టూడెంట్ ను వేరుగా కూర్చోబెట్టాలి. ఈ మేరకు బహ్రెయిన్ ప్రభుత్వం కొత్త మార్గదర్శనాలను విడుదల చేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







