ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్‌ పొడిగింపు

- February 25, 2022 , by Maagulf
ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్‌ పొడిగింపు

ఖతార్: ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను నియంత్రించే చట్టం నంబర్ 21/2015ను ఉల్లంఘించిన ప్రవాసుల చట్టబద్ధ స్థితిని సరిదిద్దడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ  మార్చి31 వరకు గ్రేస్ పీరియడ్‌ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరోసారి రిమైండర్‌ను జారీ చేసింది. ఉల్లంఘన పరిష్కార మొత్తంలో 50% తగ్గింపు నిచ్చారు. ఈ అవకాశాన్ని వ్యాపార యజమానులు, కార్మికులు వినియోగించుకోవాలని సూచించింది.  ఉల్లంఘనల పరిష్కారం కోసం ఫాలో-అప్ విభాగానికి లేదా ఉమ్ సలాల్, అల్ రయ్యాన్, మెసైమీర్, అల్ వక్రా, ఉమ్ సునైమ్‌లోని సేవా కేంద్రాలను సందర్శించాలని కోరింది. ఈ గ్రేస్ పీరియడ్ నుండి రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు (కంపెనీలు), వర్క్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు లాభం పొందవచ్చని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. యజమానులు, ప్రవాసులు తమ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com