ఒమన్ ‘వర్క్ వీసా ఫీ’పై త్వరలోనే ప్రకటన

- February 25, 2022 , by Maagulf
ఒమన్ ‘వర్క్ వీసా ఫీ’పై త్వరలోనే ప్రకటన

ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రవాసులకు వర్క్ వీసాల జారీకి విధించే ఫీ పై సమీక్ష పూర్తయిందని, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక శాఖ మంత్రి డా. మహద్ బిన్ సయీద్ బావోయిన్ మాట్లాడుతూ.. జాయింట్ కమిటీలు, ప్రొడక్షన్ పార్టీల నుండి కనీస వేతనాల అధ్యయనాల ఫలితాలను సమీక్షించినట్లు చెప్పారు. కనీస వేతనం నిర్ణయించేందుకు కృషి జరుగుతోందన్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, అలాగే మహమ్మారి ప్రభావాలు వంటి ఇతర అంశాలతో పాటు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం కనీస వేతనం 325 ఒమనీ రియాల్ గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com