యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు..
- February 26, 2022
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. కీవ్ నుంచి రొమేనియా చేరుకున్న విద్యార్థులు ఇవాళ భారత్ చేరుకోనున్నారు. రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో 470 మంది స్వదేశానికి రానున్నారు. రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ బయలుదేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయల్దేరాయి. ఉదయం 10.30 గంటలకు ఎఐ 1942 విమానం ఢిల్లీ చేరుకోనుంది. మరో ఎఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకు చేరుకోనుంది.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు బయల్దేరారు. తరలింపు ఖర్చును పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం తెలిపింది. యుక్రెయిన్ నుంచి వస్తున్న వారిలో 22 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రానున్న 13 మంది, ముంబైకి రానున్న 9 మంది విద్యార్థులు రానున్నారు.
ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దులకు చేరుకొని స్వదేశానికి చేరుకుంటున్నారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్ నుంచి భారతీయులతో మరో ఎయిర్ ఇండియా విమానం బయలుదేరనున్నారు. పలువురు తెలుగు విద్యార్థులు ఈ సాయంత్రానికి ఢిల్లీ, ముంబయి చేరుకోనున్నారు. యుక్రెయిన్‌లో ఉన్న ఏపీ విద్యార్థుల తరలింపుపై సమీక్ష జరిపిన సీఎం జగన్.. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







