1 రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. సేవలు ప్రారంభించిన చిన జీయర్ స్వామి
- February 26, 2022
హైదరాబాద్: ఆరోగ్యం.. ఆహారం లేకుండా అసలు జీవితమే లేదని త్రిదండి పీఠాధిపధి చిన జీయర్ స్వామి సెలవిచ్చారు. అనారోగ్యాల కోసం జనం భారీ ఎత్తున డబ్బులు ఖర్చుపెడుతోన్న ప్రస్తుత కాలంలో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందిస్తోన్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ సేవలను జీయర్ ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ ప్రాంతంలో గల సీజీ చారిటీ ఆస్పత్రిలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డాక్టర్ గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని చిన జీయర్ సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమని జీయర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీజే ఛారిటీ ఆస్పత్రి నిర్వాహకులు.. చిన్నజీయర్ స్వామికి పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







