ఉక్రెయిన్ కు ఆర్ధికంగా సాయం అందిస్తున్న అమెరికా
- February 26, 2022
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు..
ఇక, ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.. 600 మిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. తక్షణ సైనిక అవసరాల కోసం ఇది వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.. మరోవైపు, ఉక్రెయిన్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభంచగానే అమెరికా రష్యాపై అనేక ఆంక్షలను విధించింది. దీంతో పాటు ఉక్రెయిన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేందుకు భారీ సాయాన్ని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కాపాడేందుకు ఆఫర్ చేయగా.. ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!