‘మా’ ఆఫీస్ లో చోరీ..
- February 27, 2022
హైదరాబాద్: మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు దొంగలు ఝలక్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా ఆఫీస్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా..ఈ చోరీ పై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను ఈ చోరీ జరిగినప్పటి నుంచి కనిపించడంలేదని విష్ణు మేనేజర్ సంజయ్ ఫిర్యాదులో తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణచేపట్టారు. మరి ఈ విషయమై మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







