డ్రోన్ల ద్వారా ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్ ల డెలివరీ

- February 28, 2022 , by Maagulf
డ్రోన్ల ద్వారా ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్ ల డెలివరీ

యూఏఈ: ఎమిరేట్స్ గుర్తింపు కార్డులు (EID), డ్రైవింగ్ లైసెన్స్ లతోపాటు ఇతర డాక్యుమెంట్స్ ను డెలివరీ చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగించాలని UAE ప్రభుత్వం భావిస్తున్నట్లు డిజిటల్ విభాగం తెలిపింది. అధికారిక పోర్టల్‌లు, మొబైల్ ఫోన్‌ల ద్వారా వ్యక్తులకు ఎలక్ట్రానిక్, స్మార్ట్ సేవలను అందించడానికి ఇప్పటికే 15 ఛానెల్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. UAE ప్రభుత్వ అధికారిక పోర్టల్, అబుదాబి ప్రభుత్వ సేవల కోసం “Tamm” వెబ్‌సైట్, దుబాయ్ డిజిటల్, సర్వీస్ సెంటర్ 1, షార్జా డిజిటల్, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రభుత్వం, UAE ప్రభుత్వ స్మార్ట్ యాప్‌లు, అబుదాబి టామ్ సేవల యాప్, దుబాయ్ నౌ యాప్, దుబాయ్ సేవల యాప్‌లు, ఏకీకృత అజ్మాన్ అధికారిక పోర్టల్‌లు ప్రభుత్వ యాప్ (eAjman), రస్ అల్ ఖైమా స్మార్ట్ గవర్నమెంట్ అప్లికేషన్స్ స్టోర్ (mRAK) ల ద్వారా ఇప్పటికే సిటిజన్స్/రెసిడెంట్స్ కు డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఉమ్ అల్ క్వైన్‌లోని షేక్ ఖలీఫా జనరల్ హాస్పిటల్ రోబోట్‌ను ఉపయోగించి 30 కంటే ఎక్కువ ఆపరేషన్లు చేసిందని డిజిటల్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాగే UAE యూనివర్సిటీలోని పరిశోధకులు మానవరూపంలో ఉండే రోబోట్‌ను తయారు చేశారని, అది ఆటిజంతో బాధపడుతున్న పిల్లలను చూసుకుంటుందన్నారు. అంతేకాకుండా  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ వివిధ సేవలను అందించడానికి UAE అంతటా ఉన్న అధికార శాఖలలోని కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో "హమద్ రోబోట్"ను కూడా పరిచయం చేసిందని యూఏఈ డిజిటల్ విభాగం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com