హేమమాలిని బాలయ్య తల్లిగా!
- March 31, 2016
బాలయ్య వందో చిత్రానికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. గౌతమి పుత్ర శాతకర్ణిగా నటించేందుకు బాలయ్య సిద్దం కాగా ఇప్పటికే గుర్రపు స్వారీలపై తగిన శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ వందో చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించనుండగా, ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్టు సమాచారం. యోధుడు టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఏప్రిల్ 8న అమరావతిలో జరపనున్నట్టు టాక్.గౌతమ పుత్ర శాతకర్ణి అంటూ గౌతమి కుమారుడు శాతకర్ణి అని అర్ధం . అమ్మ పేరు కలసి వచ్చేలా ఆ చక్రవర్తి పేరు ఉంది. చక్రవర్తిగా బాలయ్య నటించనుండగా, తల్లి పాత్ర కోసం పలువురు సీనియర్ నటీమణులను క్రిష్ సంప్రదిస్తున్నట్టు టాక్ .అయితే ఆ రాజమాత పాత్ర కోసం హేమమాలని , శోభనలలో ఒకరిని అనుకుంటున్నారు. అయితే శోభన గతంలో బాలయ్య నటించగా హేమమాలిని వైపే యూనిట్ ఎక్కువగా దృష్టి సారిస్తుందని సమాచారం.హేమమాలిని ప్రస్తుతం అమెరికాలో ఉండగా, ఏప్రిల్ 10న ఇండియాకు రానున్నట్టు తెలుస్తుంది. ఆ రోజు ముంబైలో హేమమాలినిని కలిసి ఈ విషయంపై తుదినిర్ణయం తీసుకోనుంది చిత్ర యూనిట్. ఇక హీరోయిన్గా నయనతారని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







