మళ్ళీ కళకళ్ళాడుతున్న రెస్టారెంట్లు

- February 28, 2022 , by Maagulf
మళ్ళీ కళకళ్ళాడుతున్న రెస్టారెంట్లు

కువైట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కళ కోల్పోయిన రెస్టారెంట్లకు మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత కళ వచ్చినట్లవుతోంది. కోవిడ్ పాండమిక్ ప్రభావం తగ్గుతున్న దరిమిలా, రెస్టారెంట్లకు జనం ధైర్యంగా వస్తున్నారు. కువైట్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ హాలీడేస్ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన అశోక్ కల్రా అనే ఓ రెస్టారెంట్ యజమాని బిజినెస్ తిరిగి పుంజుకుంటోందని చెప్పారు. సాల్మియా ప్రాంతలో ఓ రెస్టారెంట్ మేనేజర్ అబ్దుల్లా మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో జనం రెస్టారెంట్లకు వస్తుండడం ఆనందంగా వుందని నఅ్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com