భారత్ కరోనా అప్డేట్
- March 01, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో ఒకే రోజు 6,915 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 4,29,31,045కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 60 రోజుల తర్వాత లక్ష కంటే తక్కువకు పడిపోయాయి. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 92,472కి తగ్గాయి.
ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు మరింత మెరుగుపడి 98.59 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.77 శాతంగా నమోదైంది. అయితే వారపు పాజిటివిటీ రేటు 1.11 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,23,24,550కి చేరుకోగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు







