ఏపీ కరోనా అప్డేట్
- March 01, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,17,953 మంది కరోనా బారినపడ్డారు.వారిలో 23,01,210 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 2వేల 014 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 729కి పెరిగింది. రాష్ట్రంలో నేటి వరకు 3,31,17,181 కరోనా టెస్టులు చేశారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్(AP Corona) విడుదల చేసింది. కాగా, క్రితం రోజుతో(71) పోలిస్తే ఇవాళ కొత్త కేసులు పెరిగాయి.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!