భారత్‌ కరోనా అప్డేట్

- March 02, 2022 , by Maagulf
భారత్‌ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రభావం బాగా తగ్గింది. ఇవాళ ఇండియాలో భారీగా తగ్గాయి కరోనా పాజిటివ్ కేసులు. 7,554 కొత్త కేసులు నమోదయ్యాయి. 223 మరణాలు నమోదయ్యాయి. 14,123 రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటిన్ తెలిపింది. యాక్టివ్ కేసులు 85,680గా వున్నాయి. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. నిన్నటికంటే 9శాతం కేసులు పెరిగాయి.

ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసులు తక్కువగానే ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,38,599 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,14,246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 98.60 శాతానికిపైగా ఉంది. వరుసగా 24 రోజుల నుంచి లక్షకు దిగువన కేసుల సంఖ్య నమోదవుతున్నాయి.నెల రోజుల  క్రితం 3 లక్షల వరకూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇదిలా వుంటే… దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,79,92,977 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. నిన్న 8,55,862 మందికి టీకాలను వేశారు. కాగా.. దేశంలో ఇప్పటివరకు దాదాపు 77 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com