తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

- March 03, 2022 , by Maagulf
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్:  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణలో  సంచలనంగా మారిపోయింది.ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర…మహబూబ్ నగర్‌కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్‌, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.ఫిబ్రవరి 23వ తేదీన ఫరూక్, హైదర్ ఆలీలు సుచిత్రాలోని ఓ లాడ్జిలో దిగారని..25వ తేదీన లాడ్జీ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని చంపేందుకు ప్రయత్నించారన్న సీపీ.. అక్కడ తప్పించుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు.. యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ అనే మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తులు వీరి పై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు అందింది. వీరిద్దరిని 26వ తేదీన అరెస్ట్ చేశామన్నారు.రఘు మరి కొందరితో కలసి హత్యకు కుట్రపన్నారని పోలీసుల విచారణలో తేలినట్టు తెలిపారు స్టీఫెన్‌ రవీంద్ర.

ఇక, కేసులో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజులను ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర.. మిగిలిన ముగ్గురిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నామని.. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజు, అమరేందర్‌ కలసి మహబూబ్ నగర్ నుంచి విశాఖ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు.అక్కడ షెల్టర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ ఇచ్చారన్న ఆయన.. ఇందులో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.రాఘవేందర్‌ రాజు నుంచి రెండు రౌండ్ల 9 ఎంఎం, పిస్టల్‌.. దుండిగల్‌ ఫారెస్ట్‌ ఏరియాలో 6 రౌండ్స్‌ రివాల్వర్‌ రాజు నుంచి రికవరీ చేసి.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని.. రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలినట్టు తెలిపారు.. కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జితేందర్‌రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్‌ థాప, సౌత్‌ అవెన్యూలోనే షెల్టర్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. మరోవైపు ఇందులో డీకే అరుణ పాత్రపైనా విచారణ జరుపుతామన్నారు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com