యుక్రెయిన్ లో భారతీయ బాధితులకు ‘సోనూసూద్’ సాయం
- March 03, 2022
ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ బాధితులకు, నిర్భాగ్యులకు సాయం అందించడంలో ముందుంటాడు. అడిగితే చాలు.. కాదనలేని మనసున్న మనిషి.యుక్రెయిన్ పై రష్యా యుద్ధంతో..యుక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు ఒకవైపు ముమ్ముర ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అయినా కొందరు బాధితులు సోనూసూద్ ను స్మరించుకుంటున్నారు.సాయం కోసం సామాజిక మాధ్యమాల సాయంతో ఆయనకు వినతులు పంపుతూనే ఉన్నారు.
సోనూసూద్ కు చెందిన చారిటీ సంస్థ నుంచి తమకు సాయం అందడం పట్ల అక్కడి భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.సహాయక కార్యక్రమాలకు సంబంధించి సోనూసూద్ కూడా తన ట్విట్టర్ పేజీలో తాజా వివరాలను ఉంచుతున్నారు. ‘‘ఇది నా బాధ్యత. నా వంతుగా సాయం చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను’’ అంటూ సోనూ స్పందించాడు.
కరోనా మహమ్మారి నియంత్రణ సమయంలో లాక్ డౌన్ లు విధించిన సమయంలోనూ బాధితులు స్వస్థలాలకు చేరేందుకు సోనూసూద్ సాయపడడం తెలిసిందే.యుక్రెయిన్ లోని ఖర్కీవ్ పట్టణంలో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించడంలో సోనూసూద్ కు చెందిన చారిటీ సంస్థ సేవలు అందిస్తోంది. అక్కడి నుంచి పోలండ్ సరిహద్దుకు తరలిస్తోంది.
That's my job.
— sonu sood (@SonuSood) March 2, 2022
I am glad that I was able to do my bit,
Big thank you to Government of India for all the support.
Jai hind 🇮🇳 https://t.co/KWhf7R4pP9
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







