న్యూ లుక్ లో అజిత్

- March 03, 2022 , by Maagulf
న్యూ లుక్ లో అజిత్

చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘వాలిమై’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత అజిత్ థియేటర్‌లలోకి తిరిగి వచ్చినందుకు అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, అజిత్ తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు తాత్కాలికంగా “AK61” అని పేరు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా అజిత్ ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

నిన్న రాత్రి జరిగిన అజిత్, షాలినీల కుమారుడు ఆద్విక్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించినవి ఈ ఫోటోలు. ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆద్విక్‌ పుట్టినరోజు వేడుకలను అజిత్ కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో సెలెబ్రేట్ చేశారు. ఇక ఈ పిక్స్ లో అజిత్ ఎప్పటిలాగే తన స్టైలిష్ పొడవాటి గడ్డం లుక్‌లో నెరిసిన జుట్టుతో డాషింగ్‌గా కనిపించాడు. అజిత్ “AK61″లో ఇదే లుక్ లో కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ పిక్స్ లో అజిత్ భార్య షాలిని, కుమారుడు ఆద్విక్ కుమార్, కుమార్తె అనౌష్క కుమార్ కూడా చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com