ఏపీ కరోనా అప్డేట్: కరోనా ఫ్రీ దిశగా ఎనిమిది జిల్లాలు..
- March 03, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలోకి వచ్చింది. పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగివచ్చింది.రోజువారీ కేసులు సగటున 150కి మించడం లేదు. ఒక్క జిల్లాలో కూడా రోజువారీ కేసుల సంఖ్య 30 దాటలేదు. కేవలం ఒక్క జిల్లాలోనే రోజువారీ కేసుల సంఖ్య 20 దాటింది.
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,460 టెస్టులు నిర్వహించగా.., 122 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 జిల్లాల్లో 20లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 23 కేసులు నమోదవగా.. విజయనగరం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు.
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కడప జిల్లాలో 08, కృష్ణా జిల్లాలో 06, కర్నూలు జిల్లాలో 02, నెల్లూరు జిల్లాలో 06, ప్రకాశం జిల్లాలో 04, శ్రీకాకుళం జిల్లాలో 02, విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 00, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23,18,176 పాజిటివ్ కేసులు నమోదుకాగా... వీరిలో 23,01,904 మంది కోలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3,16,371 మందికి వైరస్ సోకగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 92,218 మందికి కరోనా బారినపడ్డారు.
గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 236 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ సంఖ్య 576 కు తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 660 యాక్టివ్ కేసులుండగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 11 యాక్టివ్ కేసులున్నాయి.గడచిన 24గంటల్లో కరోనాతో ఎలాంటి మరణాలు నమోదుకాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,729గా ఉంది.
ప్రభుత్వం తాజాగా నిర్వహించిన 13,460 టెస్టులతో కలిపి ఇప్పటివరకు 3,31,39,649 టెస్టులు నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం రోజుకి 10వేల నుంచి 15 వేల టెస్టుల వరకు నిర్వహిస్తోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో గత కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య బాగా తగ్గింది
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







