యుక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన సీ-17 విమనాలు
- March 04, 2022
న్యూఢిల్లీ : యుక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశం నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది.యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు విమానాలు న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి
వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
కాగా, ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటివరకు 6400 మంది భారతీయులు యుక్రెయిన్ నుంచి తిరిగివచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.మరో రెండు మూడు రోజుల్లో 7400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని తెలిపింది.ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు యుక్రెయిన్ ను వీడారని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







