ఆర్‌బీఐ లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ
- March 05, 2022
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే..హైదరాబాద్‌లో 40 ఖాళీలు, అహ్మదాబాద్35, బెంగళూరు- 74, భోపాల్ 31, భువనేశ్వర్ 31, చండీగఢ్ 78, చెన్నై 66, గువాహతి 32, జైపూర్ 48, జమ్మూ12, కాన్పూర్ అండ్ లక్నో 131, కోల్‌కతా26, ముంబై 128, నాగ్‌పూర్ 56, న్యూఢిల్లీ75, పాట్నా 33, తిరువనంతపురం అండ్ కొచ్చి54 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ తెలిసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2022 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.50గా నిర్ణయించారు. ఎంపికైనవారికి రూ.20,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.55,700 లభిస్తుంది.
దరఖాస్తులు పంపేందుకు మార్చి 8, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మార్చి 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మేలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పరీక్షా కేంద్రాలున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







