అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ

- March 05, 2022 , by Maagulf
అర్దియా హత్యలు: పనిమనిషికి కస్టడీ

కువైట్: అర్దియా ప్రాంతంలో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి పనిమనిషిని కస్టడీలోకి తీసుకున్నారు డిటెక్టివ్స్. రోజువారీ కూలీగా పని మనిషి మృతుల ఇంట్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని విచారిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. పదునైన ఆయుధంతో ముగ్గురు వ్యక్తుల్ని కిరాతకంగా హతమార్చారు. హత్యలతోపాటు దొంగతనం కూడా జరిగిందనే ప్రచారాన్ని అధికారులు ఖండించారు. ఎలాంటి విలువైన వస్తువులూ ఇంటి నుంచి అపహరణకు గురి కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com