తెలంగాణ: రేపు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్
- March 05, 2022
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.. దీనిపై గవర్నర్ తమిళసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు రేపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతోంది.రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది.ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2022-23కి ఆమోదం తెలుపనున్నారు. మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2022-23ని సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి హరీష్‌రావు. ఇక అసెంబ్లీ సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో చర్చించి సోమవారం ఓ నిర్ణయానికి రానున్నారు.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
- హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!







