కోవిడ్ నిబంధనలను ఎత్తివేసిన సౌదీ
- March 06, 2022
సౌదీ: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సంబంధించిన ముందుజాగ్రత్త, నివారణ నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై సోషల్ డిస్టెన్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి కాదు. అలాగే రెండు పవిత్ర మస్జీదులతోపాటు అన్ని ప్రార్థన మందిరాల్లోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధనలను తొలగించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. డెవోటీస్ మాత్రం మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. సౌదీ అరేబియాకు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా COVID-19 క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇకపై ప్రయాణీకులు వచ్చిన తర్వాత PCR పరీక్షను చేయించుకోవాల్సి అవసరం కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







