నల్ల జీలకర్రతో ఉపయోగాలు..

- March 06, 2022 , by Maagulf
నల్ల జీలకర్రతో ఉపయోగాలు..

వంటల్లో వాడే వస్తువుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలను నివారించేందుకు నల్ల జీలకర్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ని, రక్తపోటుని నివారిస్తుంది. రెండు నెలల పాటు నిరంతరంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. బ్లాక్ జీరా ఆయిల్‌తో మసాజ్ చేయడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఉబ్బసం లేదా బ్రాంకైటిస్ లక్షణాలను ఎదుర్కోవడంలో ప్రభావవంతంగా తోడ్పడుతుంది.నల్ల జీరా ఆయిల్‌ను కొద్దిగా ఆలివ్ ఆయిల్‌తో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా మృదువైన మరియు నిగనిగలాడే చర్మాన్ని ఇస్తుంది. ఈ రెండు నూనెలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

వయసు కారణంగా చర్మంలో ముడతలు సంభవిస్తుంటాయి. ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్‌లో ½ టీస్పూన్ నల్ల జీలకర్ర ఆయిల్ కలిపి త్రాగాలి.ఈ మిశ్రమం మీ శరీరంలోని అన్ని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. చర్మం మెరుపుని సంతరించుకుంటుంది.

నల్ల జీలకర్రలో థైమోక్వినోన్‌ ఆల్కలాయిడ్స్, ప్రొటీన్లు ఉన్నాయి, ఇవి జుట్టు రాలడం మరియు పల్చబడడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బ్లాక్ జీరాలో ఉన్న యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా నెత్తిమీద చుండ్రు, దురదలను తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఉండే అమినో యాసిడ్‌లు హెయిర్‌ కండీషనర్‌గా పనిచేసి జుట్టును స్మూత్‌గా ఉంచుతాయి.

ఈ రెండు ఆయిల్ప్ కలిపి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు స్కాల్ప్‌ను మసాజ్ చేయాలి. అరగంట తరువాత, జుట్టును హెర్బల్ షాంపూతో కడగాలి. ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లను గట్టి పరిచి వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది. అప్పుడప్పుడు ఆముదంతో కలిపి రాసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com