ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
- March 06, 2022
అమృత్సర్: ఆదివారం అమృత్‌సర్‌లోని ఖాసా గ్రామంలోని బీఎస్ఎఫ్ మెస్‌లో తుపాకీ కాల్పుల కలకలం రేగింది. కానిస్టేబుల్ తుపాకీ బుల్లెట్లు పేల్చడంతో ఐదుగురు సరిహద్దు భద్రతా దళాల జవాన్లు మరణించారు. మరి కొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం మార్చి 6న జరిగింది. ప్రస్తుతం నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతదేహాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌లోని బీఎస్ఎఫ్ మెస్‌లో ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తన సహచరులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. గాయపడిన వారందరినీ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారు.
తుపాకీ బుల్లెట్లు పేల్చిన కానిస్టేబుల్‌ను కటప్పగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ ఎందుకు కాల్పులు జరిపాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ మొదలైంది.ఆదివారం ఉదయం సహచరులతో వాగ్వాదానికి దిగుతున్న సమయంలో సటప్ప అనే కానిస్టేబుల్ ఒక్కసారిగా తన తుపాకీ నుంచి కాల్పులు జరిపాడు. అయితే జవాన్ ఏ పరిస్థితుల్లో కాల్పులు జరిపాడనే దానిపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వాస్తవాలను నిర్ధారించడానికి కోర్టు విచారణకు ఆదేశించబడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







