టాలీవుడ్‌కు శుభవార్త..
- March 07, 2022
అమరావతి: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నాన్ ఏసీ థియేటర్, ఏసీ థియేటర్, మల్టీప్లెక్స్‌ల వారీగా టిక్కెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియం కేటగిరిలుగా టిక్కెట్ రేట్లను విభజించింది.
మున్సిపల్ కార్పొరేషన్లలో (ఉదాహరణకు విజయవాడ, గుంటూరు, విశాఖ) నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40… ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70, స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100, మల్టీప్లెక్సులలో రూ.150గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది. ఒకవేళ రిక్లయినర్ సీట్లు ఉంటే రూ.250గా విక్రయించుకోవచ్చని సూచించింది.
మున్సిపాలిటీలలో (ఉదాహరణకు తెనాలి, ఏలూరు, భీమవరం, చీరాల) నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30… ఏసీ థియేటర్లలో రూ.80, 60, స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80, మల్టీప్లెక్సులలో రూ.125గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది.
గ్రామ పంచాయతీలలో (సి, డి సెంటర్లు) నాన్ ఏసీ థియేటర్లలో రూ.40, రూ.20, ఏసీ థియేటర్లలో రూ.70, రూ.50, స్పెషల్ థియేటర్లలో రూ.90, రూ.70, మల్టీప్లెక్సులలో రూ.100గా టిక్కెట్ రేట్లను నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







