సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు: సీఎం జగన్

- March 08, 2022 , by Maagulf
సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు: సీఎం జగన్

అమరావతి: గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు.గౌతమ్‌రెడ్డి మృతి తనకు,పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు.

మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.
పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com