మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

- March 08, 2022 , by Maagulf
మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చ్ 8th) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వారిచే 120 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం నోవొటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానానికి ముఖ్యఅతిధిగా  సైబరాబాద్ డీసీపీ & షీ టీమ్ ఇంచార్జ్ సి.అనసూయ మరియు మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ  & క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి  మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ & షీటీమ్ ఇంచార్జ్ సి.అనసూయ  మాట్లాడుతూ ఈ మహిళా దినోత్సవం మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళల విజయాలు జరుపుకోవడానికి అంకితం చేయబడింది.మహిళలు సమిష్టిగా స్థాపించిన ఈ రోజు, లింగ సమానత్వం, మహిళల హక్కులపై కూడా దృష్టి పెడుతుంది మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆశిస్తున్నాను అని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ గారు మాట్లాడుతూ 
BREAK THE BIAS అనే థీమ్ తో మనం ఈ సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.దీని యొక్క ముఖ్య ఉద్దెశం పురుషులతో పాటు మహిళలు సమానులే అని గుర్తించాలి.ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎన్నో మైలురాయిల్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా డాక్టర్స్ కి వారి సేవలను గుర్తించి అవార్డ్స్ ప్రదానోత్సవం ముఖ్యఅతిధులచే ఇవ్వడం జరిగింది.

క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి గారు మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు ఇంత గొప్ప కార్యక్రమం వివిధ హాస్పిటల్స్ డాక్టర్స్ ని పిలిచి వారి సేవలను గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాల సంతోషంగా ఉన్నది.కోవిడ్ సమయంలో వైద్యుల సేవలు మనం మరువలేనివి. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందటం చాలా సంతోషంగా ఉన్నది. మున్ముందు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్న అన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన సైబరాబాద్ డీసీపీ & షీ టీమ్ ఇంచార్జ్ సి అనసూయ మహిళా డాక్టర్స్ కి  కృతజ్ఞతలు తెలియచేసారు మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com