UAEలో రమదాన్ 2022: షార్జాలో తగ్గిన పని వేళలు

- March 09, 2022 , by Maagulf
UAEలో రమదాన్ 2022: షార్జాలో తగ్గిన పని వేళలు

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ సంస్థలకు కొత్త పని వేళలను షార్జా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు షార్జా మానవ వనరుల శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం..రమదాన్ నెలలో అధికారిక పని సమయాలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉండనున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో UAE 4.5-రోజుల పనివారంగా మార్చింది. అదే సమయంలో షార్జా మూడు రోజుల వీకెండ్ ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం సగం పని దినం కాగా, షార్జాలో మాత్రం సెలవు దినం. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ శని, ఆదివారాలు సెలవు. పవిత్ర మాసంలో ఫెడరల్ ప్రభుత్వ సంస్థలకు వారాంతపు రోజులలో (సోమవారం నుండి గురువారం వరకు) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పని సమయం ఉంటుందని యఏఈ ప్రభుత్వం గత వారం ప్రకటించింది. శుక్రవారాల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు ఉంటాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 2 నుంచి రమదాన్ మొదలు కానుండగా.. నెలవంక చూడటం ద్వారా అసలు తేదీ నిర్ణయించబడుతుంది. ఇస్లామిక్ నెలలు నెలవంక దర్శనాన్ని బట్టి 29 లేదా 30 రోజులు ఉంటాయి. ఈ సంవత్సరం,రమదాన్ మే 1 వరకు 30 రోజులు ఉంటుందని అంచనా వేయబడింది. అంటే మే 2 ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఫితర్‌లో మొదటి రోజు అయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com