నిరుద్యోగులకి శుభవార్త చెప్పిన సీఎం కెసిఆర్
- March 09, 2022
హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారు.అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగాలపై స్పందించారు. 11 వేల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. 80,039 ఉద్యోగాల భర్తీకి ఉన్నపళంగా నోటికేషన్ ఇస్తాం. అన్ని పోస్టులకు ఈ రోజు నుంచే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. హోంశాఖలో భర్తీ చేయబోయేవి 18,334 పోస్టులు, విద్యాశాఖలో 13,086 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 12,775 పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమఖాఖలో 4,311 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు.అన్ని పోస్టులకు నేడే నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అలాగే రెవెన్యూ శాఖలో 3,560 పోస్టులు, ఎస్సీ డెవలప్ మెంట్ లో 2879, ఇరిగేషన్ లో 2692 పోస్టులు, ట్రైబల్ వెల్ ఫేర్ లో 2399, మైనార్టీ వెల్ ఫేర్ లో 1825, అటవీశాఖలో 1598 పోస్టులను భర్తీ చేయన్నట్లు చెప్పారు.అటెండర్ నుంచి ఆర్డీవో పోస్టు వరకు స్థానికులకే వర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.అన్ని పోస్టుల్లోల స్థానికులకు 95 శాఖం రిజర్వేషన్, 5 శాతం ఓపెన్ కోటాలో పోటో పడొచ్చు అని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







