బ్రేకింగ్: తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం
- March 09, 2022
తెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ – జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతికి చెందిన వ్యక్తులు వంశీకృష్ణ అనే వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
భూవివాదంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు ప్రాధమిక సమాచారం. గతంలో వంశీకృష్ణ ఒగ్గు తిరుపతి పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా….. మార్చి 1వ తేదీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లపై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డి దారుణ హత్య గావించబడ్డారు. మరో రియల్టర్ రఘురెడ్డికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీనివాస్ రెడ్డి, రఘురెడ్డిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారు. స్కార్పియోలో గాయాలతో రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. తనపై కాల్పులు జరిగినట్టు రఘురెడ్డి స్థానికులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు మట్టారెడ్డిని తేల్చారు రాచకోండ పోలీసులు. కేవలం హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు సూత్రాదారిగా మట్టారెడ్డి గ్యాంగేనని పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు.
రియల్టర్ల జంట హత్యల కేసులో మొత్తం ఐదుగురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సుపారీ గ్యాంగ్ సాయంతో మట్టారెడ్డి గ్యాంగ్ ఈ హత్యలు చేసిన పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యకేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో మట్టారెడ్డి సహా మోహినుద్దిన్ (వాచ్ మెన్) నవీన్ (బినామీ) మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అంతేకాదు.. అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితమే ఇబ్రహీంపట్నంలో రాఘవేంద్ర రెడ్డితో కలిసి 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కొన్న స్థలం తనదేనంటూ మట్టారెడ్డి కబ్జా చేశాడు. దాంతో రియల్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి ఆ స్థలం వద్దకు వెళ్లారు. అక్కడే మట్టారెడ్డితో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న మట్టారెడ్డి అనుచరులు వారిద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బుల్లెట్ కారణంగా తీవ్రంగా గాయాలపాలైన రాఘవేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







