మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనలో ఉపరాష్ట్రపతి
- March 09, 2022
ఐజ్వాల్: నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మిజోరం, సిక్కిం రాష్ట్రాల పర్యటనకు విచ్చేశారు.ఈ సందర్భంగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, మిజోరం ఆరోగ్యం, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ లల్తాంగ్లియానా, రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన, ఇతర ప్రముఖుల లెంగ్ పుయ్ విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం రాజ్ భవన్ లో ఉపరాష్ట్రపతి ని, మిజోరం ముఖ్యమంత్రి జోరంతుంగ మర్యాదపూర్వకంగా కలిశారు.
సాయంత్రం మిజోరం రాజ్ భవన్ లో గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, మిజోరం సంస్కృతిని ప్రతిబింబించే సర్లాంకై, చీలం, కెరా నృత్య రూపాలను ఉపరాష్ట్రపతి తిలకించారు. అనంతరం కళాకారులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.మార్చి 10వ తేదీ ఉదయం మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించనున్నారు.


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







