ఎన్నికలపై మోడీ మాటలకు ఏకీభవించని పీకే

- March 11, 2022 , by Maagulf
ఎన్నికలపై మోడీ మాటలకు ఏకీభవించని పీకే

హైదరాబాద్: 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం తర్వాత నిన్న ప్రధాని మోదీ ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

అయితే ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు. ఇవాళ తన ట్విట్టర్‌లో స్పందించిన ప్రశాంత్ కిషోర్‌.. 2024 లోక్‌సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా 2024ను నిర్ణయించలేరన్నారు. ఈ విషయం సాహెబ్‌కు తెలుసు అని, కానీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఆధారంగా తమ పార్టీ వైపు అందర్నీ మళ్లించేందుకు ప్రధాని ఓ తెలివైన ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాలపై నిర్ణయాత్మక సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దు అని, తప్పుదోవ పట్టించే రీతిలో ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com